18, ఆగస్టు 2019, ఆదివారం

అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనమ్ ‌|
పరోపకారకరణం, దేహి మే పరమేశ్వర! ||

5, జులై 2019, శుక్రవారం

ఇంగ్లీషు పాట యొక్క రాగమును అనుసరించి వ్రాసిన భక్తి-గీతము.
ఒక భక్తుడు స్వామితో ఇట్లు విన్నవించుకుంటున్నాడు.
పల్లవి
నిన్నే నమ్మి
సర్వం అమ్మి
అయ్యాను నీవాడనే ||
నిన్నే మెచ్చి
నీతో వచ్చి
అయ్యాను నీవాడనే ||
చరణం
నా లాభం నష్టం
యోగక్షేమం
అంతా నీదేనులే|
నాలో నీవు
నీలో నేను
కలిసిపోయాములే || నిన్నే నమ్మి..||

21, జూన్ 2019, శుక్రవారం

                   ब्रह्मण: स्तुति: ।
हिरण्यगर्भं ब्रह्माणं, विरिंचिं कमलासनम् ।
प्रजापतिं सुरज्येष्ठम् , वन्दे(अ)हम् परमेष्ठिनम् ।।  ( नमामि चतुराननम् ।। )
पितामहं चात्मभुवम् , लोकेशं च स्वयम्भुवम् ।
धातारमब्जयोनिं च, नमामि चतुराननम् ।। ( वन्दे(अ)हम् परमेष्ठिनम् || )
विश्वसृजं विधातारं, स्रष्टारं वेधसं विधिम् ।
शतघृतिमजं वन्दे, शतानन्दं विरिंचनम् ।।
नमामि नाभिजन्मानम् , विरिंचं कमलोद्भवम् ।
 सदानन्दं रजोमूर्तिम् , सत्यकं हंसवाहनम् ।।
हैमाण्डजं च सृष्ट्यादौ, प्रलये(अ)प्यमरं तथा ।
पुरातनं च सर्वेषाम् , नमामि द्रुहिणं सदा ।।


14, జూన్ 2019, శుక్రవారం

Swa-rachitam padyam

अच्युतानन्तगोविन्द-, नारायण-जपं नर: ।
शुभेच्छुस्सततं कुर्यात्, हृदि संचिन्तयन्  हरिम् ।। ( 14/07/2019)
అచ్యుతానంతగోవింద-, నామత్రయజపం నర: |
ప్రాతర్నిద్రాత ఉత్థాయ, కుర్యాదష్టోత్తరం శతమ్ ||  (21/06/2019)

1, జులై 2018, ఆదివారం

स्वरचितानि पद्यानि ।
मञ्जर्या इव ते वाग्भ्य:, मथु स्रवति सुन्दरि!  अतस्त्वं गुरुणा शब्द-, मञ्जर्या बहुमानिता ।।   ( हे प्रिये ! )
डाम्बिको(अ)यं नरो नूनं, ग्रामसिंह: सुनिश्चित: ।  यतो भषति पश्चाद्धि, सम्मुखे तु पलायते  ।।
రామ ! రామ ! జయ రాజారామ !,  రావణసంహర ! రణభీమ ! ‌
రఘుకులసోమ ! జానకిరామ !,  కావుము దయతో మమ్ము సదా ‌‌‌‌||

29, జనవరి 2017, ఆదివారం

నేను 4వ తరగతిలో ఉండగా (1948వ సంవత్సరములో)  చదువుకున్న పద్యములు
1.  ఆటవెలది ఛందస్సు
ఆఢ్యుడున్నయప్పుడందరు  పూజ్యులే
లెక్కమీద సున్నలెక్కినట్లు  |
అతడు పోయినప్పుడందరపూజ్యులే
లెక్కలేక సున్నలేగినట్లు ||

2. కందపద్యము
చేతనగువాడు తనపని
కై తగ్గును వంగుగాక యల్పుండగునే? |
ఏతము చడి తా వంగును
పాతాళము నీరుదెచ్చి బయలంజల్లున్ ||


2, ఫిబ్రవరి 2016, మంగళవారం

నిజామ్ నవాబ్ అగు ముల్క్ ఇబ్రహీమ్ కవి పణ్డిత పోషకుడై ఉండెను. తెలుగులో అతనిని మల్కిభరాముడని  పిలిచేవారు. ఒక రోజు అతడు తన ఆస్థానకవికి ఈ క్రింది సమస్య ఇచ్చి పూరించమనెను. " నాలుగు కుండలుండవలె. నా పేరుండవలె. అటువంటి పద్యమును చెప్పుము." అప్పుడా కవి ఆశువుగా ఈ క్రింది పద్యమును చెప్పెను.
ఆకుండ కల్పవృక్షమ!
ఈకుండగ లోభివగుదు-విహపరములకున్ |
నీకుండగ మాకిచ్చుట
మాకుండగనడుగవలదు-మల్కిభరామా! ||
ఈ పద్యము ఆది-అనుప్రాసకు ( beginning rhyme ) చక్కని ఉదాహరణము.
ఆది శంకరాచార్యులవారు తమ భజగోవిందస్తోత్రములొ ఆది-అనుప్రాస కలిగిన ఈ క్రింది పద్యమును చెప్పియున్నారు.
గేయం గీతానామసహస్రం, ధ్యేయం శ్రీపతిరూపమజస్రం | నేయం సజ్జనసంగే చిత్తం, దేయం దీనజనాయ తు విత్తమ్ ||
సంస్కృతసాహిత్యములో ఆదిశంకరాచార్యులవారే అంబాష్టకమను మరియొక స్తొత్రములో అన్ని పద్యములలోను ఈ ఆది-అనుప్రాసను పాటించియున్నారు.  ఉదాహరణకు అందులోని మొదటి  పద్యమును ఇచ్చుచున్నాను.  ఈ స్తోత్రమును  కాళిదాసకృతకాళికాదశశ్లోకీ అని కొంతమంది పిలిచెదరు.
చేటీభవన్నిఖిలఖేటీ కదంబతరువాటీషు నాకిపటలీ-,
కోటీరచారుతరకొటీమణీకిరణకోటీకరంబితపదా |
పాటీరగంధికుచశాటీ కవిత్వపరిపాటీమగాధిపసుతా,
ఘోటీకులాదధికధాటీముదారముఖవీటీరసేన తనుతామ్ ||